పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతి: తిరుపతిలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకంను సీఎం చంద్రబాబు, తిరుచానూరులోను ప్రారంభించాడు.. ఆదివారం సదరు వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలగించి సీఎం చంద్రబాబు, స్వయంగా టీ తయారు చేశాడు.. అనంతరం వినియోగదారుడితో ముచ్చటించిన సీఎం, సిలిండర్ గ్యాస్, AG&P పైప్ లైన్ గ్యాస్ మధ్య తేడాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ, తిరుచానూరులో గ్యాస్ వాడుతున్న ఓ ఇంటిని పరిశీలించడం జరిగింది. కట్టెలపొయ్యి నుంచి గ్యాస్ పైపు లైన్ వరకూ రాష్ట్రం ఎదగడం సంతోషంగా ఉంది. అంతరాయం లేని గ్యాస్ అందుబాటులోకి రావడం సంతోషం. త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ద్వారా తిరుపతి జిల్లాలో 51 పరిశ్రమలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ద్వారా భవిష్యత్తులో 7.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. పర్యావరణహిత ప్రాజెక్టులను రాష్ట్రంలో ప్రోత్సహిస్తాం. సూర్యఘర్ కుసుమ్ ద్వారా ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీని తయారు చేస్తాం. ప్రతి ఇల్లు, పరిశ్రమ పైపుడ్ గ్యాస్ లైన్ ద్వారా అనుసంధానం జరగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. సంక్రాంతి పండగ కోసం దేశ, విదేశాల నుంచి స్వగ్రామాలకు తరలివస్తున్న తెలుగు ప్రజలకు స్వాగతం పలుకుతున్నా. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని” చెప్పారు.