ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
వక్ఫ్ బోర్డు చైర్మన్, కమిషనర్..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నెల్లూరు నగరంలోని V.R.high School & PNM మున్సిపల్ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్ధుల్ అజీజ్, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజలు శనివారం సంయుక్తంగా ప్రారంభించారు.. దాదాపు 300 వందల విద్యార్థులు పౌష్ఠిక విలువ కలిగిన రుచికరమైన భోజనాన్ని స్వీకరించారు.. ఈ పథకాన్ని కళాశాలలో ప్రవేశ నిర్వహిస్తున్నందుకు విద్యార్థిని విద్యార్థులు హర్షాన్ని వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఏకైక కాలేజీ మున్సిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు కార్పొరేషన్ కు సొంతం అన్నారు.. ఇక్కడ పేద పిల్లలు చదువును అభ్యసిస్తున్న వారు అర్ధాకలితో బాధ పడకుండా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది.. విద్యార్థులు అందరూ ఈ సదుపాయం ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ కళాశాలను 2014-2019లో తమ ప్రభుత్వమే ప్రారంభించడం జరిగిందన్నారు.. ఈ కళాశాల ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లను తయారు చేసిందన్నారు..ప్రస్తుతం పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు మండల విద్యాశాఖాధికారి తిరుపాల్రు, మునిసిపల్ కళాశాల ప్రిన్సిపాల్ యస్.శివరాం ప్రసాద్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.