రామలింగాపురం రైల్వే అండర్ బిడ్జీ సమస్యపై స్పందించిన కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి
సమస్య చాలా చిన్నదిగా కన్పిస్తుంది..దాని తాలుక ప్రభావం అనుభవించే వారికే అర్దం అవుతుంది..కార్లు,అటోల్లో ప్రయాణించే వారికి ఈ సమస్య కన్పించదు..ఈ సమస్య టూ వీలర్స్ ఉపయోగించే వారికే తెలుస్తుంది..థ్యాంక్స్ టు శ్రీధర్ రెడ్డి…..
నెల్లూరు: రామలింగాపురం రైల్వే అండర్ బిడ్జీ వద్ద, పైన ట్రెయిన్ వెళ్లుతున్న సమయంలో బ్రిడ్జి క్రింద నుంచి వెళ్లే టు వీలర్స్ అగిపోయోవారు..బ్రిడ్జి పై నుంచి ట్రైయిన్ వెళ్లే సమయంలో రైల్లోని వారు టాయిటెట్స్ ను ఉపయోగిస్తే,, ఆశుద్దమైన నీరు బ్రిడ్జి క్రింద నుంచు వైళ్లే తమపైన పడుతుందన్న ఇబ్బంది టూ వీలర్స్ కు వుండేది..వీరి బాధలను తెలుసుకున్న రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి గత సంవత్సరం అక్టొబరు 26వ తేదిన విజయవాడ రైల్వే డివిజన్ అధికారులకు లెటర్ ద్వారా తెలియ చేశారు..ఇందుకు స్పందించిన అధికారులు డిశంబరు 2వ తేదిన బ్రిడ్జిపైన రైల్వే ట్రాక్ ఇరువైపుల నుంచి ఆశద్దమైన నీరు క్రింద ప్రయాణించే వారిపైన పడకుండా,,ఐరన్ షిట్స్ ను మర్చేందుకు అనుమతులు ఇచ్చారు..దింతో విజయవాడ రైల్వే డివిజన్ లో ఒక వెల్డర్ టీమ్ ను నెల్లూరుకు పంపించారు..పగటి సమయంలో రిపేర్స్ చేయాలంటే,,స్థానిక ట్రాఫిక్ పోలీసుల అనుమతులు కూడా అవసరం..నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఈనెల 8వ తేది నుంచి 13వ తేది వరకు అనుతులు ఇచ్చారు..దింతో వెల్డర్ అశోక్ తదితర వెల్డర్స్ టీమ్,శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రిపేర్ పనులు మొదలు పెట్టారు..వారిని news19tv.com వివరాలు అడిగినప్పుడు,అశోక్ అనే వెల్డర్ స్పందిస్తూ,,తమకు నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు అనుమతులు ఇచ్చిన తేదిల్లోపు ఒక వైపు ట్రాక్ కు సంబంధించిన పనులు పూర్తి చేస్తామన్నారు..రెండో వైపు ట్రాక్ రిపేర్స్ చేసేందుకు ఐరన్ షిట్స్ వచ్చిన తరువాత సదరు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు..టూవీలర్స్ సమస్యపై స్పందించిన ఎట్టకేలకు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డికి నగర వాసులు ధన్యవాదలు తెలియచేయాల్సి అవసరం వుంది….కదా మరి ?