భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు ఇక నుంచి సులభతరం-మంత్రి నారాయణ
అమరావతి: కొత్త సంవత్సరం 2025లో రాష్ట్ర ప్రభుత్వం FLAT,,PLOT కొనుగొలు చేయలి అనుకునే ప్రజలకు,,బిల్డర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017,ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017 లో సవరణలు చేస్తూ శుక్రవారం వేరువేరుగా జీవోలను ప్రభుత్వం జారీ చేసింది..ఈ సందర్బంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణలు,, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది జరిగేలా కీలక సంస్కరణలతో తాజా ఉత్తర్వులు జారీ చేశామని,, సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మార్పులతో జీవోలు జారీ చేయడం జరిగిందన్నారు.. గతంలో లే అవుట్లలో రోడ్లకు ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేయడం జరిగిందని,, 500 చ.మీ. పైబడిన స్థలాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.. TDR బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ,, సబ్ రిజిస్ట్రార్ లను తొలగించడం జరిగిందని తెలిపారు.. రాష్ట్ర, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీటర్లు సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగించడం జరిగిందని చెప్పారు.. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనలతో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని,, తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
GO_MS_No_3_dt_09_01_2025 – Amendment to Layout Rules -2017-NARAYANA