తిరుపతిలో టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తప్పు జరిగింది, క్షమించండి-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతి: బుధవారం రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో,గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు..ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆయన అడిగి తెలుసుకున్నారు.తొక్కిసలాటలో గాయపడి తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి,, క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలకమండలిలోని సభ్యులకు పవన్ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో తప్పు జరిగింది క్షమించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని,,సామాన్య భక్తుల దర్శనాలపై దృష్టి పెట్టాలని టీటీడీకి సూచించారు.