ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ప్రకటించిన కార్యదర్శి కృతికా శుక్లా
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు ప్రవేశపెట్టెందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.. బుధవారం అమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించనున్నదని వెల్లడించారు.. చాలా సంవత్సరాలుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని,, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు.. సైన్స్,,ఆర్ట్స్,, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామన్నారు..విద్యార్థులు,,వారి తల్లిదండ్రులు,,విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.. 2025-26 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో NCERT పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని,, NEET,,JEE వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు సులభమవుతుందన్నారు..ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు..ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు..ఈనెల 26వ తేదిలోగా సంస్కరణలపై సలహాలు,, సూచనలు పంపాలని కోరారు.