ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది-వైయస్.జగన్
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులతో..
అమరావతి: ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని,, మీపై అన్యాయాలు చేసిన వారిని ఉపేక్షించం,వారిని చట్టం ముందు నిలబెడతా అంటూ కార్యకర్తలకు మాజీ సీఎం వైయస్.జగన్ భరోసా ఇచ్చారు..బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ సమావేశమైయ్యారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిత్వం,విలువలు ముఖ్యం…అందుకే మనం ఎన్నికల్లో అబద్దాలు చెప్పలేదు…చంద్రబాబు మోసాలు గురించి ఆరోజే చెప్పాను… రూ.15వేల కోట్ల కరెంటు ఛార్జీలు పెంచారు…గ్రామీణ రోడ్లలోనూ టోల్ బాదుడుకు శ్రీకారం…రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడూ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.. మనం చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నామని,,సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించాలని,,ప్రతి సమస్య మీద సోషల్ మీడియాలో చంద్రబాబును నిలదీయాలని పార్టీ శ్రేణులకు వైయస్.జగన్ దిశా నిర్దేశం చేశారు.