రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం-APSDMA
అమరావతి: దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో గురు,,శుక్రవారాల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ MD కూర్మనాథ్ వెల్లడించారు.. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.. మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం బలహీనపడినట్లు APSDMA తెలిపింది..రుతుపవన ద్రోణి జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతాల మధ్య బంగాళాఖాతం వరకూ అల్పపీడనం పయనిస్తూ సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొంది..ఇదే సమయంలో ఈనెల 19వ తేదిన పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది..సముద్రతీరం వెంట పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దంటూ APSDMA సూచనలు చేసింది..