A2 విజయసాయిరెడ్డి తండ్రి కూడా ఒక హత్య కేసులో A2నే ? -మంత్రి ఆనం
నెల్లూరు: ఎన్నికల ముందు A2 విజయసాయిరెడ్డి గురించి నేను చెప్పాను..ఆయన తండ్రి కూడా A2గా ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు.. A2గా ఉంటే బాగుండదని భావించిన విజయసాయిరెడ్డి A1గా హోదా పెంచుకునేందుకు విశాఖపట్నంలో దురగతాలకు పాల్పపడ్డారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు..గురువారం నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి లాంటి దుర్మార్గపు నాయకులు మనకు అవసరమా…ఎన్నికల్లో ఎం.పీగా పోటీ చేసిన అతన్ని నెల్లూరు ప్రజలు ఓడించి,, 5 సంవత్సరాల్లో అతను చేసిన దురాగతాలకు తగిన విధంగా బుద్ది చెప్పారన్నారు..
మదన్‌మోహన్ మానిపాటి అనే వ్యక్తి తన భార్య, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన కె.శాంతిపై ఆరోపణలు చేశారని తెలిపారు..తాను విదేశాల్లో ఉండగా వేరొకరితో గర్భం దాల్చిందని,,దీనిపై విచారణ జరిపి,,ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారన్నారు.. తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డి,,న్యాయవాది సుభాష్‌లే కారణమనే ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో తెలిపారన్నారు..
శాంతి అనే మహిళ 2019లో సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైంది..దేవదాయా శాఖలో సహాయ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తొంది.. ఆమెకు 21-04-2020లో విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు అని మంత్రి ఆనం తెలిపారు..ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయి అధికారులు విచారణ చేసి 02-07-2024లొ సస్పెండ్ చేశామన్నారు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండే ఉంటే అమె సస్పెన్షన్ కు జరిగేది కాదేమో… ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి..విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారు.. విజయవాడలో విల్లా కొనుక్కోవాలని కమిషనర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసిందని,,అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదన్నారు..అపార్ట్ మెంట్ కొనుగోలుకు అనుమతించారన్నారు.. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలకు, రెవెన్యూశాఖ న్యాయవాది సుభాష్,,శాంతిల పాత్ర ఉందని మాకు సమాచారం అందిందని తెలిపారు.. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయన్నారు.. వీటిపై కూడా విచారణ చేస్తున్నామన్నారు.. దేవాదాయశాఖ భూములను 11 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇవ్వల్సి వుండగా,అమె 33.,,66,,99 సంవత్సరాల లీజు పెంచుకునే వెసులుబాటు కల్సిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు.. నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
కుటుంబ విలువల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం విడ్దూరంగావుందని మంత్రి నారా లోకేష్,, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గురించి దారుణంగా ట్వీట్లు చేశారు, గుర్తుకు రాలేదా..? శాంతి విషయమైన మీడియా సమావేశంలో తన మీద నిందలు వేసిన వారి గురించి విలేఖర్లు ప్రశ్నించగా, వారిని మాట్లాడకుండా మీడియా గురించి బూతులు తిట్టినప్పడు విలువలు ఎక్కడి పోయాయంటూ మండిపడ్డారు.