పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ-జగన్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు,, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెటకారంతో కూడిన వ్యాఖ్యలు చేశారు..బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు..వైసీపీ ప్రతిపక్షం హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను విలేఖరి జగన్ దృష్టికి తీసుకుని రావడంతో అయన స్పందిస్తూ,,పవన్ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని, ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్ కు ఎక్కువ,,,,ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యనించారు.. వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం..10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని గుర్తు చేశారు..ఎక్కడైనా ప్రభుత్వంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేవి రెండూ ఉంటాయని గుర్తు చేశారు.. అధికారంలో ఉన్నప్పుడూ అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.