INTERNATIONALNATIONALOTHERS

జపాన్ ప్రధాని సనాయె తకాయిచి నా చిన్న చెల్లిలు-ప్రధాని న‌రేంద్ర మోదీ

భారత ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు..

అమరావతి: భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని ప్రధాని న‌రేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు తకైచి జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. గురువారం ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని సనాయె తకాయిచిని తన అందమైన చెల్లెలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు.

జపాన్ ప్రధాని సనాయె తకాయిచి:- అన్నింటికంటే ముందుగా, మీ దేశంలో నా పర్యటన సందర్భంగా మీరు చూపిన ఆప్యాయమైన ఆతిథ్యానికి గాను ప్రధాన మంత్రి మోదీకి-భారత ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాన మంత్రి మోదీ, నన్ను మీ అందమైన చెల్లెలిగా పిలిచారు. ప్రధాన చర్చలకు ముందు జరిగిన మా చిన్న సమావేశంలో, మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటేనని-మా మధ్య సోదర-సోదరీమణుల అనుబంధం ఏర్పడిందని మేము భావిస్తున్నమని అన్నారు. జపాన్-భారతదేశం కలిసి మరింత బలంగా, సంపన్నంగా మారడానికి తమ తమ బలాలను వినియోగించుకోవాలి” అని తకైచి అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *