AP&TG

వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది

‘సైక్లోనిక్ స్టార్మ్’ ..

అమరావతి: బంగాళాఖాతంలోని వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇది విశాఖకు 960 కి.మీ,ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ చెన్నైకి 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపటికి తుపానుగా, ఎల్లుండికి తీవ్ర తుపానుగా బలపడి, గురువారానికి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనించి, నవంబర్ 16 సాయంత్రానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు-దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ‘సైక్లోనిక్ స్టార్మ్’ (తుపాను)గా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత, నవంబర్ 17 సాయంత్రానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఇది ‘సివియర్ సైక్లోనిక్ స్టార్మ్’ (తీవ్ర తుపాను)గా మరింత బలపడవచ్చు. తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి, వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *