NATIONALOTHERSSPORTS

జపాన్ గడ్డపై అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించిన భారత షట్లర్ లక్ష్యసేన్

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు..

అమరావతి: భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ జపాన్ గడ్డపై అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. జపాన్ మాస్టర్స్-2026 సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొవడంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో జపాన్ ఆటగాడు కోకి వతనాబేపై 13-21, 21-18, 21-14 తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు.

తొలి గేమ్‌లో కోకి వతనాబే చెలరేగిపోయి, చురుకైన షాట్లతో 13-21తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సమయంలో ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని భారత షట్లర్ రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. కీలక పాయింట్ల వద్ద సంయమనం పాటిస్తూ, ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చాడు. చివరకు 21-18తో రెండో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మలుపు తిప్పాడు. మూడో గేమ్‌లో లక్ష్యసేన్,ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వతనాబేపై ఒత్తిడి పెంచాడు. వరుస పాయింట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ 21-14తో మూడో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో 13-21, 21-18, 21-14తో మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జపాన్ మాస్టర్స్ విజయం లక్ష్యసేన్‌కు టైటిల్‌తో పాటు కీలక ర్యాంకింగ్ పాయింట్లనూ అందించనుంది. ఈ విజయంతో 9,200 ర్యాంకింగ్ పాయింట్లు చేరనున్నాయి. దింతో (BWF) వరల్డ్ టూర్ స్టాండింగ్స్‌లో 12వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యసేన్ తొందరలో నేరవేరనున్నది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *