జనసేన తెలంగాణ వీరమహిళల ఆత్మీయ సమావేశం
పార్టీ సంస్థాగత విస్తరణలో మహిళల భాగస్వామ్యంపై..
హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వీరమహిళల ఆత్మీయ సమావేశం మాదాపూర్‌లోని జూబ్లీ రిడ్జ్ వేదికగా ప్రారంభమైంది. జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు వీరమహిళలు సమావేశానికి తరలివచ్చారు. పార్టీ సంస్థాగత విస్తరణలో వీరమహిళల పాత్ర, నాయకత్వ బాధ్యతల్లో మహిళలకు ప్రాధాన్యం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో ముఖాముఖి చర్చించినట్లు తెలుస్తొంది. వీరమహిళల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ రాష్ట్ర నాయకత్వం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా దిశానిర్దేశం చేయనున్నారు.

