AP&TG

ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం-వాతావరణ శాఖ

అల్పపీడనం తుఫాన్‌గా మారితే (‘అక్వాన్‌‘) పేరు..

ఈ నెల 16 నాటికి తుఫాన్ గా బలపడే అవకాశం..

అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ శుక్రవారం తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ శనివారం అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిమీ గరిష్టంగా 60కిమీ వేగంతో గాలులతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై దిశపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారితే దానికి ‘అక్వాన్‌’గా పేరు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19వ తేదీ సాయంత్రం తీరాన్ని దాటే అవకాశాలున్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *