AP&TG

పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ,ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రతిపాదనల అమోదం

సీ.ఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, హోంశాఖ బలోపేతం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా క్యాబినెట్ 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలతో పాటు రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ది పథంలో నడిపే పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఏఐ డేటా సెంటర్లు, ఏవీజీసీ పాలసీ:- రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ 2026-31 కాలానికి ఏపీ ఏవీజీసీ-ఎక్స్‌ ఆర్ (AVGC-XR) పాలసీతో పాటు 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు, సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0 సవరణలకు అంగీకరించింది. అలాగే అన్నమయ్య జిల్లాలో ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో FLO మహిళా పారిశ్రామిక పార్కు, నాయుడుపేటలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ప్రత్యేక ట్రాఫిక్ డైరెక్టరేట్ ఏర్పాటు:- రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్రంగా ప్రత్యేక డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటుకు హోంశాఖ ప్రతిపాదనను ఆమోదించారు. అలాగే రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయానికి (KVS) 5 ఎకరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ (ITI) కాలేజీ ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం కేటాయింపు. తిరుమల శ్రీవారి ఆలయంలో ‘ప్రధాన సన్నిధి యాదవ’, ‘సన్నిధి యాదవ’ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం. దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదాలో ‘ముఖ్య స్థపతి’ పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ తో పాటు మరిన్ని ప్రతిపాదనలకు అమోదం తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *