చిన్న వయసులోనే గుండెపోటుతో డాక్టర్ లావణ్య మృతి
న్యూరాలజీలో గోల్డ్ మెడల్..
తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే..
ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధితో..
నెల్లూరు : ఎనెల్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్, న్యూరాలజిస్ట్ కుంకాల లావణ్య(31) బ్రెయిన్ స్ట్రోక్తో శనివారం హఠాన్మరణం చెందారు. మాగుంట లేఅవుట్లోని హస్పటల్ లో ఆమె తక్కువ ఫీజులతోనే వైద్యం చేసే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. న్యూరాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ లావణ్యకు ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే:- వైద్య రంగంలో ప్రతిభ కనబరిచిన లావణ్య సోషల్ మీడియా వేదికగా కూడా ప్రజలకు వైద్య సలహాలు అందిస్తూ గుర్తింపు పొందారు. ఆమె తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే అయినప్పటికీ, ఆమెను కాపాడుకోలేకపోవడం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచింది. చిన్న వయసులోనే వైద్య రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ లావణ్య మరణవార్త పలువురిని కలచివేసింది.

