DISTRICTS

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం-జిల్లా ఎన్నికల అధికారి

నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో..

మొత్తం 128 వార్డులు.. 594 పోలింగ్ కేంద్రాలు.. 5,52,318 మంది ఓటర్లు..

పోలింగ్ విధులకు 4,351 మంది సిబ్బంది..

నెల్లూరు: జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలకు నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మొత్తం 5,52,318 మంది ఓటర్లు:- జిల్లాలోని నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చి మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 128 వార్డులు ఉండగా, 594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో మొత్తం 5,52,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,68,309 మంది పురుషులు, 2,83,921 మంది మహిళలు, 88 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 72 వార్డులు, 509 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,37,972 మంది పురుషులు, 2,51,293 మంది మహిళలు, 86 మంది ఇతరులు కలిపి మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉన్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 30 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 12,654 మంది పురుషులు, 13,875 మంది మహిళలు కలిపి మొత్తం 26,529 మంది ఓటర్లు ఉన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 55 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 17,683 మంది పురుషులు, 18,753 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు కలిపి మొత్తం 36,438 మంది ఓటర్లు ఉన్నారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు:- ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 594 పోలింగ్ కేంద్రాల్లో 52 అత్యంత సున్నిత, 200 సున్నిత, 342 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 52 అత్యంత సున్నిత, 174 సున్నిత, 283 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆత్మకూరులో 30 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉండగా, బుచ్చిరెడ్డిపాళెంలో 26 సున్నిత, 29 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

4,351 మంది పోలింగ్ సిబ్బంది నియామకం:- పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 4,351 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 713 మంది ప్రిసైడింగ్ అధికారులు (PO), 713 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO), 2,851 మంది ఇతర పోలింగ్ అధికారులు (OPO), 74 మంది మైక్రో అబ్జర్వర్లు (MO) ఉన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 3,720 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 230 మంది, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో 401 మంది సిబ్బందిని పోలింగ్ విధులకు కేటాయించారు.

1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ:- ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు కలిపి మొత్తం 1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. వీటిలో పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 1,677, సర్వీస్ ఓటర్లకు 99, పీడీ యాక్ట్ పరిధిలోని ఓటర్లకు 14 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు.మున్సిపాలిటీల వారీగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 1,390, ఆత్మకూరులో 208, బుచ్చిరెడ్డిపాళెంలో 192 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *