ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన అమెరికా,ఇటలీలు
అమరావతి: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని USA రాయబార కార్యాలయం బుధవారం (20వ తేది) నాడు మూసివేసినట్లు అంతర్జాతీయ వార్తల సంస్థలు వెల్లడించాయి.. USA రాయబార కార్యాలయంపై, వైమానిక దాడికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం అందడంతో, అమెరికా కార్యాలయంను మూసివేశాయని పేర్కొంది..ఎంబసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.. ఎయిర్ అలర్ట్ లు ప్రకటించగానే కీవ్‌లోని మెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.. రష్యా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ (RIA) సమాచారం మేరకు…రష్యాలోని పలు ప్రాంతాలపై,, ఉక్రెనియన్ లాంగ్ రేంజ్ క్షిపణి దాడులను చేసేందుకు అమెరికా అనుమతి ఇచ్చిన వెంటనే,,ఉక్రెయిన్,,రష్యాపై దాడులు జరిపింది..అలాగే ఉక్రెయిన్ కు పూర్తి సహాకారం అందిస్తున్న NATO దేశాలు,, తగిన మూల్యం చెల్లించక తప్పదని రష్యా విదేశీ ఇంటెలిజెన్స్ చీఫ్ సెర్గీ నారిష్కిన్ చెప్పారు.
ఇటలీ రాయబార కార్యాలయం:- అలాగే ఉక్రెయిన్‌లోని ఇటలీ రాయబార కార్యాలయం ముందుజాగ్రత్తగా ఈరోజు మూసివేయబడుతుందని ఇటలీ ప్రకటించింది.. పెద్ద ఎత్తున దాడి జరగవచ్చని సమాచారం అందిందని చెప్పడంతో దాని స్వంత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని గతంలో అమెరికా నిర్ణయాన్ని ఉటంకిస్తూ ప్రకటన విడదల చేసింది.
అగ్నికి ఆజ్యం:- రష్యా,, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత తీవ్రమైయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు,, రష్యా పైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది.. దీంతో ఆగ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, అణ్వాయుధాల ఉపయోగించేందుకు అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై సంతకం చేశారు.. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే,, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు.