రష్యాపై ATACMS క్షిపణులతో దాడులు చేసిన ఉక్రెయిన్
అమరావతి: రష్యా,, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్దం మరో అంచకు చేరుకున్నట్లు కన్పిస్తొంది.. దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా ప్రస్తుత అధ్యక్షడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో,,ఒక రోజు వ్యవధిలో రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేసింది..అమెరికా తయారు చేసిన ATACMS (160 KM దూరం ప్రయోణించే)క్షిపణులను రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగించింది. బ్రియాన్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ 6 ATACMS మిసైళ్లతో దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరిస్తూ,, వాటిలో 5 మిసైళ్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.. ఒక క్షిపణి మాత్రం బ్రియాన్స్క్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై పడిందని,, దాంతో మంటలు చెలరేగినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని,, సహాయక సిబ్బంది మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించింది..ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా ఇంకా స్పందించలేదు.