అడబిడ్డల సింధూరం తుడిపివేస్తే,అంతకు పదింతలు నష్టం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు అనుభవించారు-ప్రధాని మోదీ
అమరావతి: ఆపరేషన్ సిందూర్‌లో త్రివిధ దళాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని,, మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం రాత్రి 8 గంటలకు ఆపరేషన్ సిందూర్ జరిగిన తీరును వివరిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు..భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు..అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..భారత దేశంలో అడబిడ్డల సింధూరం తుడిపివేస్తే,,అంతకు పదింతలు నష్టం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు అనుభవించేలా బుద్ది చెప్పడం జరిగిందన్నారు..ఇప్పటికి అనేక సార్లు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు భారత్ లో ఎన్ని దారుణలకు పాల్పపడ్డారని తెలిపారు..భారతదేశం,,పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లో కరుడు కట్టిన మతోన్మాది మరణిస్తే,,పాకిస్తాన్ సైనికి అధికారులు అంత్యక్రియల్లో పాల్గొనడం ప్రపంచం అంతా చూసిందన్నారు..పాకిస్తాన్, ఉగ్రవాదులకు యూరివర్సీటిగా మారిందన్న విషయం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందన్నారు..చర్చలు-ఉగ్రవాదం,,చర్చలు-వ్యాపారం వేరు అంటూ రాయబరాలు వుండవన్నారు..అలాగే చర్చలు-నీటి పంపకాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు..భవిష్యత్ లో ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పపడితే అంతకు రెట్టింపు ఫలితం అనుభవించేలా భారత్ వైపు నుంచి ప్రతి స్పందన వుంటుందంటూ పాకిస్తాన్ ను హెచ్చరించారు.