అమెరికా పౌరులు కాని వ్యక్తులు లక్షకు రూ.5 వేలు ట్యాక్స్ కట్లాల్సిందే?-ట్రంప్
అమరావతి: అమెరికా పౌరులు కాని వ్యక్తులు అమెరికా నుంచి ఇతర దేశాలకు పంపే నగదుపై 5 శాతం పన్నును విధించాలన్న రూల్ ను అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీ తెర మీదకు తెస్తొంది..ఈ కొత్త పన్ను అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది..యూఎస్ కాంగ్రెస్‌లో మే 12న రిపబ్లికన్ సభ్యులు ఈ కొత్త పన్నుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. ‘ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అనే ఈ బిల్లును ఇటీవల యుఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ విడుదల చేసింది.. ఈ 389 పేజీల పత్రంలోని 327వ పేజీలో అటువంటి అన్ని నగదు బదిలీలపై 5% పన్ను విధించే నిబంధన గురించి ప్రస్తావన ఉంది..అయితే అందులో కనీస మొత్తం గురించి ప్రస్తావించలేదు..ఈ బిల్లు అమోదం పొందితే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ భారత్‌లోని తమ కుటుంబాలకు క్రమం తప్పకుండా డబ్బు పంపే చాలా మంది ఎన్నారైలకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది.. భారత్‌కు ప్రతి ఏడాది ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయుల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి దాదాపు 83 బిలియన్ల డాలర్లు వస్తాయి.. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొత్త పన్నును తీసుకువస్తే భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు ఎన్నారైలు పంపే ప్రతి రూ.1 లక్షలో రూ.5,000ను పన్ను రూపంలో అమెరికా తీసుకుంటుంది..ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు ఆ పన్ను కోతలు శాశ్వతంగా ఉండేలా చేస్తుంది.. స్టాండర్ట్ డిటెక్షన్‌ను పెంచడం,, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లుగా ఉంచడం వంటి ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి.జ ఈ బిల్‌ను చాలా “గొప్పది”గా పేర్కొంటూ దీన్ని త్వరగా ఆమోదింపజేయాలని రిపబ్లికన్ సభ్యులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు.