లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్ట్
అమరావతి: గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ లు జరుగుతున్నాయి..శుక్రవారం ఈ కేసులో రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ CM YS జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారికంగా ప్రకటించారు..బుధవారం నుంచి వీరిని విచారించి సిట్ అధికారులు,,నేడు అనంతరం అరెస్ట్ చేశారు..జగన్ ప్రభుత్వ పాలన సమయంలో రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని విక్రయించారు..అలాగే మద్యం కొనుగోళ్లు అన్ని డిజిటల్ చెల్లింపులు అవకాశం లేకుండా నేరుగా నగదు చెల్లిస్తేనే విక్రయాలు అంటూ మద్యం లెక్కలను తారుమారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి..గత ప్రభుత్వం విక్రయించిన నాసిరకం మద్యం కారణంగా,వందల మంది మరణించారు..చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడంపై దృష్టి పెట్టింది.. మద్యం వ్యవహారంపై సిట్ ను ఏర్పాటు చేసి,ప్రభుత్వం దర్యాప్తుకు అదేశించింది..దర్యాప్తులో భాగంగా,,మద్యం విక్రయాలతో సంబంధం వున్నదని బావించిన పలువురు వైసీపీకి చెందిన వారిని సిట్ అరెస్ట్ చేసింది..ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో పాత్రదారి,, సూత్రదారి రాజ్ కసిరెడ్డి అని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు..దింతో కసిరెడ్డితోపాటు ఈ కేసులో పలువురు అరెస్టులు కొనసాగుతున్నాయి.. ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం వుందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది..చూడాలి మరి ఏ ఆనకొండ బయటకు వస్తుందొ.??