ఓలా,ఉబర్ గుత్తాధిపత్యాన్ని తెర- “సహర్ టాక్సీ యాప్” -హోం మంత్రి అమిత్ షా
అమరావతి: రెంటల్ రైడ్ ప్రొవైడర్ల దిగ్గజాలు అయిన ఓలా,,ఉబర్ గుత్తాధిపత్యాన్ని తెరదించే ప్రయత్నాల్లో బాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం “సహర్ టాక్సీ యాప్‌ను” ప్రారంభించినట్లు ప్రకటించారు.. డ్రైవర్లకు వారి సంపాదనపై పూర్తి నియంత్రణను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ యాప్ ను రూపొందించనట్లు తెలిపారు..సేవలు అనంతరం ఎటువంటి కమీషన్ కోత లేకుండా ఈ యాప్ వుంటుందన్నారు..గురువారం లోక్‌సభలో ప్రసంగిస్తూ హోం, సహకార మంత్రి మాట్లాడుతూ, ఈ చర్య వల్ల సహకార సంఘాలు టాక్సీలు, ద్విచక్ర వాహనాలు,ఆటో రిక్షాలు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు.. ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఉబర్‌లా లాగాపూ రైడ్ సర్వీస్‌లను అందిస్తుందని హోం మంత్రి తెలిపారు.. అంతేకాక ఈ సహకార్ టాక్సీ యాప్… ఓలా, ఉబర్‌లా మాదిరి డ్రైవర్స్ దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయదని,, మొత్తం వారికే చెల్లిస్తామని తెలిపారు..సాధారణంగా ఓలా, ఉబర్ వంటి కంపెనీలు, కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి…మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి..దీనిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సమస్యకు పరిష్కార దిశగా ఆలోచించిన కేంద్రం…సహకారీ టాక్సీ యాప్‌ను తీసుకువచ్చింది..“మా నినాదం సహకార్ సే సమృద్ధి” అయితే దీన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయడం లేదని దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు.. ఈ సహకార్ యాప్ డిజైన్ కోసం, మా ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసిందన్నారు.. డ్రైవర్లకు లాభాలు అందించే ఈ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాము అని అన్నారు.