పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వసం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం-DGMO
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘిస్తే…
అమరావతి: పహల్గామ్ లో తీవ్రవాదలు మరణకాండ తరువాత ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని సైన్యం తెలిపింది..అదివారం త్రీవిధ దళాల DGMO అధికారులు నిర్వహించిన మీడియా బ్రీఫింగ్ లో వారు మాట్లాడారు..సరిహద్దు ఆవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి స్పష్టమైన లక్ష్యలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామని DGMO లెఫ్టినెంట్ జెనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.. దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని చెప్పారు.. ఎయిర్ మార్షల్ ఏకే భారతి, పాకిస్థాన్ భూభాగంపై చేసిన దాడులను వీడియోలు, శాటిలైట్ చిత్రాలతో సహా వెల్లడించారు.. పౌరులపై దాడులకు పాకిస్థాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని తెలిపారు..ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ ల కు సముద్రం నుంచి నేవీ తగిన సహకారం అందించిందని వైస్ అడ్మిరల్ ప్రమోద్ వెల్లడించారు..శనివారం కాల్పుల విరమణ ఒప్పందం తరువాత సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన దాడులకు సరైన పద్దతి జవాబు చెప్పమని ఆర్మీ లెఫ్టినెంట్ జెనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు..మళ్లీ అటువంటి దాడులు జరిగితే చాలా గట్టిగా సమాధానం ఇస్తామన్నారు..సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్-DGMOలు పాల్గొంటారు.. కాల్పుల విరమణ కొనసాగింపు,, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.