అగ్ని వీరుడికి అశ్రునివాళి-దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం-పవన్ కళ్యాణ్
రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు,సొంత నిధుల నుంచి రూ.25 లక్షలు..
అమరావతి: భారత్-పాకిస్థాన్ మధ్య దాడులు,ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ పార్థీవదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు తీసుకొచ్చారు.. ఆదివారం ఉదయం మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ తో సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు..ఈ సందర్భంలో మురళీనాయక్ తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోపెట్టుకొని ఓదార్చారు.. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు..ఐదెకరాల భూమి, ఇంటికోసం 300 గజాల స్థలం, మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు.. మురళీ నాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని అన్నారు..అలాగే తన వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి రూ.25లక్షల సాయం అందిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు..పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల కారణంగా ఎంతో మంది అమయాకుల ప్రాణాలు పోయాయని,, మళ్లీ అలాంటి కుట్రలకు పాల్పడాలని చూస్తోందంటూ తెలిపారు.. దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం,,అలాగే ప్రధాని మోదీ,,భారత ఆర్మీకి మనమంతా అండగా ఉండాల్సిన సమయం ఇదని పవన్ కల్యాణ్ అన్నారు.