AP&TGOTHERSSPORTS

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో సమావేశం అయిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్

అమరావతి: క్రికెట్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సమావేశం అయ్యారు..విజ‌య‌వాడ‌కు చేరుకున్న క‌పిల్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు,, ఎంపీ కేశినేని శివ‌నాథ్‌తో క‌లిసి ఉండ‌వ‌ల్లికి వెళ్లి సీఎం చంద్ర‌బాబును మర్యాద పూర్వకంగా క‌లిశారు..అమ‌రావ‌తిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు పై వీరు ప్ర‌ధానంగా చ‌ర్చిన‌ట్లుగా తెలుస్తోంది..చంద్ర‌బాబుతో సమావేశం అనంత‌రం క‌పిల్ దేవ్ మీడియాతో మాట్లాడారు..క్రీడలపై సీఎం చంద్రబాబుకు చాలా ఉత్సుకత ఉందని,, గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందన్నారు.. చంద్రబాబు నుంచీ ప్రామిస్ అనేకంటే ఆయన బ్లెస్సింగ్ ఉంటుందన్నారు.. ఇండియన్ గోల్ఫ్ కి నేను ప్రెసిడెంట్ సేవాలు అందిస్తున్నాఅని,, ప్రభుత్వం ఎక్కడ భూమి ఇస్తుందనేది ప్రభుత్వానిదే నిర్ణయం అని చెప్పారు..స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తాన‌ని చెప్పారు..20 సంవత్సరాల నుంచీ క్రికెట్ లో ముందున్నామ‌ని,, తాను చాలా పాజిటివ్ గా మాత్రమే మాట్లాడుతాన‌ని క‌పిల్ అన్నారు..

అనంత‌రం ఎంపి కేశినేని చిన్నిమాట్లాడుతూ, అనంతపురం,,అమరావతి,, విశాఖ లలో గోల్ఫ్ కోర్టులు పెడతామ‌ని చెప్పారు.. కపిల్ దేవ్ ను మన రాష్ట్రానికి అంబాసిడర్ గా ఉండాలని కోరామ‌న్నారు..గోల్ఫ్ ను కూడా ఏపీలో అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామ‌న్నారు..గోల్ఫ్ కు డ్రైవింగ్ రేంజిలు సిద్ధం చేస్తామని,, మరో రెండు మూడు మీటింగ్ లలో నిర్ణయిస్తామని తెలిపారు.. ఏపీలో యువ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తామని,, గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీస్తామన్నారు.. గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *