ముఖ్యమంత్రి కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం
అమరావతి: కేరళ ముఖ్యమంత్రి పినరై.విజయన్ కాన్వాయ్ తిరువనంతపురం జిల్లా వామనపురం వద్ద సోమవారం సాయంత్రం స్వల్ప ప్రమాదానికి గురైంది..ఈ ఘటనలో కాన్వాయ్‌లోని 5 వాహనాలు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఇందులో పోలీసు ఎస్కార్ట్,, ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు,, అంబులెన్స్ ఉన్నాయి..అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.. దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ అక్కడ నుంచి వెళ్లిపోయింది..
సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్న అదే రోడ్డులో ఓ మహిళ స్కూటీపై వెళ్తు,,రోడ్డు మధ్య నుండి కుడి వైపు మలుపు తీసుకుంటుండగా వెనుకవైపు నుంచి వచ్చిన సీఎం కాన్వాయ్‌లోని పోలీసు వాహనం ఒక్కసారిగా బ్రేక్ లు వేశారు..కాన్వాయ్‌లో వెనుక నుంచి వస్తున్న వాహనాలు సడెన్ బ్రేక్స్ వేసినా కంట్రోల్ కాకపోవడంతో పోవడంతో వరుసగా ఐదు వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి..ఈ ప్రమాదంలో అంబులెన్స్ కాస్త డ్యామేజ్ అయ్యింది..వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది కారులోంచి దిగి సీఎం వాహనం వద్దకు చేరుకున్నారు.. ముఖ్యమంత్రి కారుకు పెద్దగా డ్యామేజ్ కాకపోవడం వల్ల అదే వాహనంలో ఆయనను అక్కడ నుంచి వెంటనే పంపివేశారు..ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి..