తక్కువ ధరకు మద్యం, కొత్త బ్రాండ్లు అందుబాటులోకి-మంత్రి కొల్లు.రవీంద్ర
అమరావతి: నాణ్యమైన,, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామని,,కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులతో విశాఖలో మంత్రి కొల్లు సమీక్ష నిర్వహించారు…మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని,,వైసీపీ ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారని విమర్శించారు..రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు..అనుమతి లేకుండా పబ్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామన్నారు..గతం ప్రభుత్వం డిస్టిలరీ, తయారీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని, గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖలోని అక్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు.. విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో ఎక్సైజ్ ల్యాబ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ భరత్ సందర్శించారు..ల్యాబ్‌లో పరీక్షలపై అడిగి తెలుసుకున్నారు..ఆంధ్ర వర్సిటీ ల్యాబ్‌లో 9 రకాల పరీక్షలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు..తెలంగాణ అమ్మకాలకు, ఏపీలో అమ్మకాలకు 4 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు తేడా వచ్చిందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు..గత ప్రభుత్వ అరాచకాల మీద విచారణ చేస్తున్నామన్నారు.