రాష్ట్రం నుంచి జాతీస్థాయికు 100 మంది యువ నాయకులను తయారు చేయడమే నా లక్ష్యం-పవన్
అమరావతి: ఒక గిరిజన తండాకు సరైన రోడ్లు,,చుక్క నీరు దొరకని కుటుంబాలకు బిందెడు మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి జనసేన, వీరమహిళల శ్రమ ఫలితమే అన్నారు..ఒక డాక్టరు అయివుండి,,సమాజంలో చెడును తుడిపెట్టేందుకు విప్లకారుడిగా మారిన చేగువీరా అంటే తనకు ఇష్టం అంతే కాని అయన కమ్యూనిస్ట్,,లెప్ట్ పార్టీ సిద్దాంతలను చూసి కాదన్నారు..శుక్రవారం పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ తన మనస్సును అవిష్కరించారు..11 సంవత్సరా సుధీర్ఘ జనసేన ప్రయాణంను అయన ప్రస్తవించారు..అధికారంలో వున్న పార్టీల నిర్భంధాలను చిత్తు చేసి అధికార పీఠం ఎక్కిన తీరును ప్రస్తావించారు.. అన్యాయాన్ని,,అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు..భవిష్యత్ జనసేన ప్రయాణం గురించి ప్రస్తవించారు.
అన్నీ ఒక్కడినే,, 2014 లో జనసేన పార్టీ స్థాపించాను.. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం.. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం.. ఓడినా అడుగు ముందుకే వేశాను..మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం..మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం.. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు జరిచారు, తొడలు కొట్టారు.. మన ఆడపడుచులను అవమానించారు.. ప్రజలను హింసించారు..ఇదేమి న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు..
ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం.. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం..ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం.. 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే.. ఈ 11 సంవత్సరాల్లో నేను పడ్డ కష్టాలు, బాధలు ఏమిటో కొంతైనా మీతో పంచుకుంటాను..మీ అందరినీ గుండెల్లో పెట్టుకున్నాను.. మీరే నా కుటుంబం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.