పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం అంటే”ఒక మనిషిని చంపడం కంటే దారుణం”సుప్రీంకోర్టు
అమరావతి: పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం అంటే “ఒక మనిషిని చంపడం కంటే దారుణం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రెపీజియం జోన్ లో దాదాపు 454 చెట్లను నరికివేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది..చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ,, నరికివేసిన 454 చెట్లకుగాను ఒక్కో చెట్టుకు లక్ష రూపాయల చొప్పున ఫైన్ విధిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది..కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది..పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కఠిన వ్యాఖ్యలు చేసింది..అదేవిధంగా తాజ్ ట్రెపీజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.