స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు-మంత్రి దుర్గేష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద బాపట్లలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదల చేసింది..ఈ విషయం గురించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం నాడు వెల్లడించారు.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి తెలిపారు..ఇటీవల న్యూఢిల్లీకి వెళ్లిన సందర్బంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి సూర్యలంక బీచ్‌కు నిధులు మంజూరు చేయాల్సిందిగా మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి మంత్రి కందుల దుర్గేష్ అందచేశారు..ఇచ్చిన మాటను ప్రకారం నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు,,ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు..త్వరలోనే సూర్యలంక బీచ్, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని తెలిపారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..