‘ఆపరేషన్ సిందూర్’పై వ్యతిరేకంగా వ్యాఖ్యనించిన ప్రొఫెసర్ అలీఖాన్ అరెస్ట్
అమరావతి: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై భావప్రకటన స్వేఛ్చపేరుతో దేశంలో కొంత మంది వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం దేశ ప్రజలకు అసన్నమైంది..’ఆపరేషన్ సిందూర్’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు..బీజేపీ యువ మోర్చాకు చెందిన ఓ నేత ఫిర్యాదు మేరకు అలీఖాన్‌ను దిల్లీలో అదుపులోకి తీసుకున్నామని సోనీపట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రాయ్ అజీత్ సింగ్ వెల్లడించారు..సోనీపట్‌లోని అశోకా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్ వ్యవహరిస్తున్నారు.