NATIONAL

18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్ పర్యటనలో భాగంగా దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు..వీటిలో తెలంగాణలో 3 ఏపీలో 1, యూపీలో 19, గుజరాత్ 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 రైల్వేస్టేషన్లు వున్నాయి..ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు.. తొలుత ప్రధాని మోదీ బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించుకుని,,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు, ప్రధాని మోదీకి అందజేశారు.. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు..బికనీర్‌ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించినట్లు తెలిపారు..తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు..మన మహిళల సిందూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లు వెల్లడించారు..త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయి..పహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుపెట్టమని,,మన సాయుధ దళాలు పాక్‌ను మోకాళ్ల మీద నిలబెట్టాయి..భారతదేశంలో రక్తపుటేర్లు పారించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశాం..

ఆపరేషన్ సిందూర్‌ అంటే సమర్థ భారత రౌద్ర రూపం.. భవిష్యత్ లో ఉగ్రదాడి జరిగితే మన సమాధానం ఇలాగే ఉంటుంది..పాకిస్తాన్ ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధం చేయలేదు… దొంగదెబ్బ తీయడమే పాకిస్థాన్‌కు తెలుసు…ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి పాకిస్థాన్‌ మరిచిపోయినట్టుందని వ్యాఖ్యనించారు.. రాజస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించిందని అయితే రాజస్థాన్‌ ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్‌ క్షిపణులు తాకలేకపోయాయి…ఇదే సమయంలో మన వాయుసేన మాత్రం పాక్‌లోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు..కశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం.. గతంలో రైల్వేస్టేషన్లు ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో ఆలోచించాలన్నారు.. అమృత్‌ భారత్‌ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించామని,, ఈ రైల్వే స్టేషన్లకు ప్రజలే యజమానులు…శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే అని ప్రధాని మోదీ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *