మున్సిపాలిటీల అద్దె షాపుల తేనె తెట్టుని కదలించి మంత్రి నారాయణ
ఇది జరిగే పనేనా?
చివరికి మంత్రి ఏం చెప్పాడో మీరే వినండి…
నెల్లూరు: మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు పాటపాడుకుని దక్కించుకుంటే, మరొకరు రాజకీయ బలంతోనే, రౌడీయిజంతోనే వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, ఇది మంచి పద్దతి కాదని మంత్రి నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజతో కలిసి ఆయా శాఖల అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.