గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం”మన ఊరు మాటా-మంతి”
అమరావతి: గ్రామాల అభివృద్ధి కోసం మాటా-మంతి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు..గురువారం ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, రావివలస పంచాయతీ ప్రజలందరిని టెక్కలిలోని సినిమా థియేటర్ కు తీసుకువచ్చి వారితో క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను గ్రామ ప్రజల నుండి తెలుసుకున్నారు..దీంతోపాటు వెంటనే పరిష్కారం చేయగలిగే పనులను అప్పటికప్పుడు అధికారులతో చెప్పి అనుమతులు మంజూరు చేశారు.. అలాగే కొన్ని సమయం పట్టే పనులకు సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు..గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, తాము కోరుకుంటున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వచ్చారు.