NATIONAL

చట్ట సభల్లో మహిళా సాధికారత సాధించడం విపక్షాలకు ఇష్టం లేదు-ప్రధాని మోదీ

అభివృద్దిని అడ్డుకొవడమే కాంగ్రెస్ లక్ష్యం…

అమరావతి: చట్ట సభల్లో మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి విపక్షాల వైఖరే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బిల్లు ఓడిపోవడాన్ని చూసి విపక్షాలు సంబరాలు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని, ఇది దేశ మహిళలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు.వారికి దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనలే వారికి ముఖ్యమని మండిపడ్డారు.“మహిళల కలలను చిదిమేసిన వారికి, దేశంలోని నారీశక్తి తగిన శిక్ష వేస్తుంది. ఈ పాపానికి విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. మహిళలే వారికి బుద్ధి చెప్పాలి” అని ప్రధాని పిలుపు ఇచ్చారు. విపక్షాలు స్వార్థ రాజకీయాలతో అడ్డుపడినా, తమ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ:- మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ల విషయంలో ‘భ్రూణహత్య’కు పాల్పడ్డాయని, అంటే ఆ ఆశయాలను మొగ్గలోనే తుంచేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని విపక్షాలు అవమానించాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దేశ మహిళల హక్కులను కాలరాసేలా వారి ప్రవర్తన ఉందని మండిపడ్డారు.

భారతదేశం ఎన్నటికి అభివృద్ది చెందకుడా:- దేశం ప్రయోజనల కోసం తీసుకునే ప్రతి నిర్ణయంను అడ్డుకోవాడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన దేశాలు అర్ధికంగా, టెక్నాలాజీ పరంగా ఎంతగానో అభివృద్ది సాధించాయని తెలిపారు. ఆర్టికల్ 370ని తొలగిస్తుంటే..UPI (డిజిటల్ ఫేమేంట్ సిస్ఠమ్),,త్రిబుల్ తలాక్ తొలగిస్తుంటే,,యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశ పేట్టేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.భారతదేశం ఎన్నటికి అభివృద్ది చెందకుడా వుండాలన్నదే,కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని మండిపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *