NATIONAL

జమ్ముకాశ్మీర్‌ యువకులకు, మూడు కుటుంబాలకు మధ్య ?-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ముకాశ్మీర్‌ లో తమ ప్రభుత్వం తుద ముట్టించడంతో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని,,శాంతి-సుస్థిరలతకు తాను అండగా ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శనివారంనాడు ప్రారంభించిన సందర్భంగా దోడా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు..సంవత్సరాల తరబడి జమ్మూకశ్మీర్‌లో పాలన సాగించిన కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు..గత 10 సంవత్సరాల్లో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది పనులను గురించి ప్రస్తావించారు..

కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రాజ్యమేలిందని, జమ్మూకశ్మీర్‌లో ఏళ్ల తరబడి వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేలా చేశారని ప్రధాని తప్పుపట్టారు.. ఈ ఎన్నికలు జమ్మూకశ్మీర్‌లోని యువకులకు, మూడు కుటుంబాలకు మధ్య జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.. ఒకవైపు ఆ మూడు కుటుంబాలు, మరో వైపు జమ్మూకశ్మీర్ యువత ఎన్నికల క్షేత్రంలో ఉన్నారన్నారు.. ఒక కుటుంబం కాంగ్రెస్ కాగా మిగిలిన రెండూ ఎన్‌సీ, పీడీపీ అని చెప్పారు.. ఆ మూడు కుటుంబాలు ప్రజల జీవితాలను ఎదగనివ్వకుండా,  వేర్పాటువాదం, ఉగ్రవాదానికి అవసరమైన (శిబిరాలు) వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారని, ఇందువల్ల దేశానికి శత్రువులైన వారే లబ్ధి పొందారని అన్నారు..

నేడు ఎంతో మంది జమ్మూకశ్మీరీలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోచునున్నారని చెప్పారు.. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, కొందరు తమ జేబుల్లో రాజ్యాంగాన్ని పెట్టుకుని, 75 ఏళ్లుగా మీలో కొందరిని ఎలాంటి హక్కులకు నోచుకోకుండా చేశారని విమర్శించారు..కాంగ్రెస్-పీడీపీ-ఎన్‌సీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు అమల్లోకి వస్తే జమ్మూకశ్మీర్ తిరిగి పాఠశాలలు తగులపెట్టడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతాయని హెచ్చరించారు.. జమ్మూకశ్మీర్‌లో ఉండే ప్రతి ఒక్కరూ కుల, మత బేధం లేకుండా బీజేపీ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు హక్కులకు తాను గ్యారెంటీగా ఉంటానని చెప్పారు.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని ప్రధాని మోదీ తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *