27 పొదుపు గ్రూపుల్లో రూ.50 లక్షలు దొపిడి ? -జనసేన
నెల్లూరు: పొదుపు మహిళల నిరక్షరాస్యతను,అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటు ఇటు నగరంలోను అటు రూరల్ ప్రాంతాల్లో కొందరు పొదుపు లీడర్లు లక్షల రూపాయలను దుర్వనియోగం చేస్తున్న సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి..లీడర్లు స్వంత అవసరాలకు లక్షల రూపాయలు నగదు వాడుకుంటున్నరన్న ఆరపణలు వున్నప్పటికి సంబంధిత ప్రాజెక్టు డైరక్టర్ పట్టించుకున్న పాపన పోలేదు..కష్టపడి తాము దాచుకున్న సోమ్ము తమ అవసరాలకు ఉపయోగ పడక పోవడంతో,పొదుపు మహిళలు నేడు జనసేన పార్టీ కార్యాలయంను ఆశ్రయించారు..ఈ నేపధ్యంలో పొదుపు డబ్బు కాజేసిన దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ తోటపల్లి గూడూరు మండలం నరుకూరు పొదుపు మహిళా సంఘాలకు చెందిన లీడర్లు,సభ్యులు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం గోమతి నగర్ లో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో తెలిపారు….
ఒక్కో పొదుపు గ్రూపు లో దాదాపుగా ఏడు లక్షల రూపాయల వంతున,27 గ్రూపుల ప్రాధమిక విచారణలో దాదాపు రూ 50 లక్షలు ప్రక్కదారి పట్టినట్లు తేలినప్పటికీ పోలీసులు FIR కట్టి చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపలేదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ అన్నారు..శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో అయన కిషోర్ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో పొదుపు గ్రూపుల్లో పారదర్శకత లోపించిందని,, నెలకొకరు వాయిదా సొమ్ము అకౌంట్ బుక్ తీసుకుని వెళ్లి బ్యాంకులో కట్టాల్సింది పోయి అన్ని తామై వ్యవహరించిన పొదుపు లీడర్లు లక్షలు మింగేసారని బాదితుల వాపోతున్నారని తెలిపారు.
ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని, గ్రూపులోని పదిమందికి 45000 మీరు కట్టాలి అని తగ్గించి మొత్తం ఇవ్వబోయే సరికి మేమంతా బకాయి లేము అని గ్రూప్ సభ్యులు తెలిపారని చెప్పారు..మంజూరు అయిన రుణ మొత్తాన్ని వెనక్కి పంపిన మొత్తంను రూ.20 లక్షలు లీడర్లు సొంతానికి వాడుకున్నారని మహిళలు తెలిపారన్నారు..వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టినా పురోగతికి నోచుకోలేదన్నారు..
పేద పొదుపు మహిళల సొమ్మును కాజేసిన వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తామని,, రెవిన్యూ రికవరీ ఆక్ట్ కింద కేసులు పెట్టించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు జనసేన తరఫున మద్దతుగా నిలబడతామని కిషార్ తెలిపారు..ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్, కార్యాలయం ఇంచార్జ్ జమీర్,పంచాయతీరాజ్ రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రరావు,లీగల్ సెల్ మెంబర్ శరత్ తదితరులు పాల్గొన్నారు..