DISTRICTS

మా నెత్తిన పాలు పోశావు,అందుకే నీకు పాలాభిషేకం-స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 

తిరుపతి: గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బందిని విడదీసి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పేరుతో ఆక్రమద్యం పట్టుకోవాలంటూ రోడ్ల మీదకు నెట్టింది..అప్పటి నుంచి వారి బాధలు ఎవ్వరికి చెప్పుకో లేక నలిగిపోతున్నారు..ఈ నేపధ్యంలో ఇటీవల అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తు,సిబ్బందిని తిరిగి వారి మాతృసంస్థ  ఎక్సైజ్  డిపార్ట్మెంట్లో విలీనం చేస్తు జీవో నెంబర్ 84, 85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన విడుదల చేసింది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దుచేసి ప్రొహిబిషన్&ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్&ఎక్సైజ్ సిబ్బంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,,ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో క్షీరాభిషేకం చేయడం ద్వారా కృతజ్ఞతలు తెలియచేశారు..ఈ సందర్భంగా ప్రొహిబిషన్&ఎక్సైజ్ సూపరిండెంట్లు, కే.జానకిరామ్, ఎస్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు,  హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *