NATIONALOTHERSTECHNOLOGY

స్వదేశీయంగా అవిష్కరించిన కమికేజ్ డ్రోన్‌లు ‘డూ అండ్‌ డై’

అమరావతి: భారతదేశం యొక్క 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) శక్తివంతమైన “స్వదేశీ” (స్వదేశీ) కమికేజ్ డ్రోన్‌ల అభివృద్ధిని ఆవిష్కరించింది..ఈ డ్రోన్ ను లాటరింగ్ మందుగుండు సామగ్రి అని కూడా పిలుస్తారు.. ఈ మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు) స్వదేశంలో నిర్మించిన ఇంజిన్‌లను ఉపయోగించి 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందించబడ్డాయి..‘డూ అండ్‌ డై’ అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్‌ సమర్థంగా పూర్తి చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి..కామికేజ్‌ డ్రోన్లు 21వ శతాబ్దంలో యుద్ధ రంగంలో గేమ్‌ ఛేంజర్‌గా ఉంటుందని NAL డైరెక్టర్‌ డాక్టర్‌ అభయన్‌ పషిల్కర్‌ పేర్కొన్నారు.. కామికేజ్‌ డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభానికి కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌(CSIR) ప్రాథమిక ఆమోదం తెలిపింది.. ఈలాంటి ‘డూ అండ్‌ డై’ ఆయుధాలను ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌,,ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు..రష్యా దళాలను, సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకొనేందుకు ఉక్రెయిన్‌ సైన్యం ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది.
కామికేజ్‌ అంటే:- కామికేజ్‌ అనేది ఒక జపనీస్‌ పదం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక ప్రత్కేక అటాకింగ్‌ యూనిట్‌కు ఈ పేరు పెట్టారు. ఇందులోని మిలటరీ పైలట్లు తమ యుద్ధ విమానాలను శత్రు లక్ష్యాలను ఛేధించడం ద్వారా ఆత్మాహుతి మిషన్లు నిర్వహించేవారు..
కామికేజ్‌ డ్రోన్:-2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు,,120 కేజీల బరువు, గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగం
1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం,,25 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు,,ఆత్మాహుతితో ఎంచుకొన్న లక్ష్యాలను నాశనం చేస్తాయి,,రాడార్లు, శత్రు రక్షణ వ్యవస్థను అధిగమించే సామర్థ్యం వీటికి వుంటుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *