NATIONAL

ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు-కేంద్ర మంత్రి అమిత్​ షా

అమరావతి: ప్రతిపక్ష నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ఆర్టికల్ 370 అంటూ మాట్లాడడం దారుణమని,, నేను దేశ ప్రజలకు తెలియ చేస్తున్నాను, ఇకపై ఆర్టికల్ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదని కేంద్ర మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు.. జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉచిత పథకాలతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మేనిఫెస్టోను ‘సంకల్ప్​ పత్ర్​’ పేరుతో శుక్రవారం విడుదల చేశారు..ఈ సందర్బంలో హోం మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్టికల్ యువత చేతుల్లో ఆయుధాలు, రాళ్లను మాత్రమే ఇచ్చిందని,, యువత ఉగ్రవాదం వైపు నడిచేలా చేసిందని మండిపడ్డారు..గడిచిన 10 సంవత్సరాల్లో జమ్ముకశ్మీర్​ స్వర్ణ యుగాన్ని చూసిందన్నారు.. శాంతి, అభివృద్ధి, పురోగతి అభివృద్ధికి హామీ ఇచ్చిందని తెలిపారు..అనంతరం ప్రతిపక్షాలపై మండిపడ్డారు. “నేను నేషనల్​ కాన్ఫరెన్స్ పార్టీ ఎజెండా ఏమిటో చూశాను, ఎన్​సీకి కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తుండటం కూడా చూస్తూన్నమని” అన్నారు..నేను ఒమర్​ అబ్దుల్లాకు ఒకటే చెప్పదలచుకున్నా, ఎన్నికల ఫలితాలు ఏమైనా కానీ, గుజ్జర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవ్వరినీ వెళ్లనివ్వం..జమ్ముకశ్మీర్​లో తీవ్రవాదం ఆవిర్భావానికి బాధ్యులెవరో నిర్ధరించడానికి శ్వేతపత్రం విడుదల చేస్తాం..ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాన్నమన్నారు..

ఓటర్లపై వరాల జల్లు:-‘మా సమ్మాన్​ యోజన’ కింద ప్రతి కుటంబంలోని వృద్ధ మహిళకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా రెండు గ్యాస్​ సిలిండర్లు ఇస్తామని అన్నారు..ప్రగతి శిక్ష యోజన కింద కాలేజీ విద్యార్థులకు ఏడాదికి రూ.3000 చొప్పున ఇస్తామని అమిత్​ షా ప్రకటించారు..ఈ ప్రాంత అభివృద్ధికి భరోసా ఇచ్చేందుకు మాకు ఐదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని జమ్ముకశ్మీర్​ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని అమిత్​ షా అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *