సినీ ఔత్సాహికులు ఆహ్వానం-పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని తహతహలాడే ప్రతిభావంతుల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందచేశారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, సినీ అవకాశాల కోసం చూస్తున్న సినీ ఔత్సాహికులు, ప్రొఫెషనల్స్, రీసెర్చర్స్ ను తమ గ్లోబల్ క్రియేటివ్ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు కావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానాన్ని విడుదల చేసింది. సినిమా పట్ల ప్యాషన్ ఉన్నవారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు #PKCWCommunity పేరిట ఈ బృహత్తర కార్యక్రమానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.

