AP&TGCRIME

రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు

 రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలు..

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ టీం సభ్యులు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తుండగా, పాలకోడేరు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారు ఉభయగోదావరి జిల్లాలకు వచ్చినట్లు సమాచారం.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *