AP&TG

సోషల్ మీడియాలో ఇష్టానుసరంగా వ్యవహరిస్తే చట్ట పరంగా చర్యలు-ఉప ముఖ్యమంత్రి

అమరావతి: సోషల్ మీడియాలో ఎదుట వారి పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై చట్ట పరంగా కఠినమైన చర్యలు తప్పవని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.బుధవారం అయన సోషల్ మీడియా దుర్వనియోగంపై విడుదల చేసిన వీడియాలో పై విధంగా తెలిపారు.వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాలు చెప్పడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి హక్కు ఇస్తుందన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏదైనా మాట్లాడేందుకు వీలుండదని పరిమితులున్నాయని తెలిపారు. హక్కులను ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశ సమగ్రత, పరువునష్టం, మర్యాద, నైతిక విలువలకు భంగం కలిగించరాదని సూచించారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడం టు అబ్యూజ్ కాదని అన్నారు. మా నిర్ణయాలతో విభేదించే హక్కు ఉండొచ్చని, మేం దాన్ని స్వాగతిస్తామని పవన్‌ అన్నారు. త్వరలోనే ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *