రాజస్థాన్‌లో పదమూడేళ్ల బాలికపై దాదాపు 30 మంది అత్యాచారం
బుల్ డోజర్స్ యాక్షన్…
అమరావతి: రాజస్థాన్‌లో పదమూడేళ్ల బాలికపై సామూహికంగా దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను మంగళవారం రాత్రి అధికారులు బుల్ డోజర్స్ ఉపయోగించి కూల్చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరిశంకర్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..
రాజస్థాన్‌లోని, శ్రీగంగానగర్‌కు చెందిన 8వ తరగతి చదువుతున్నపదమూడేళ్ల బాలిక జూన్ 18న స్నేహితురాలిన కలిసేందుకు శివాజీ నగర్ కు వెళ్లింది.అనంతరం తిరిగి ఇంటికి వచ్చేందుకు E- రిక్షాఎక్కింది. బాలికను రిక్షావాలా రాంబాబు, ఇంటి అడ్రసు కాకుండా,నేరుగా తీసుకుని వెళ్లి Joy Inn అనే హోటల్ నిర్వాహకుడికి అప్పగించాడు. ఆ హోటల్ ఓనర్ బాలికపై హోటల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇతర హోటళ్లకు కూడా బాలికను తీసుకెళ్లాడు. అలా నాలుగు హోటళ్లలో చిన్నారిపై అత్యాచారం, లైంగికదాడి జరిగింది. దాదాపు ఐదు రోజులపాటు (జూన్ 22వ తేది వరకు) బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివిధ హోటళ్లలో మొత్తం 30 మంది వరకు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో బాలిక నొప్పితో ఇబ్బంది పడుతూ, ఏడుస్తుంటే బాలికకు ఆల్కహాల్ తాగించి, మరీ లైంగిక దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు హోటల్స్ ఓనర్స్ ప్రధాన పాత్ర పోషించారు.
తమ కూతురు కన్పించడం లేదని బాలిక తల్లి,తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హోటల్స్ ఓనర్స్ లైంగికదాడిని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ అత్యాచారంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నలుగురు ప్రధాన నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తు్న్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

