నగరంలో రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయండి- కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: నగర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆర్ & బి అధికారులకు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ సూచించారు. ఆర్ & బి, విద్యుత్ శాఖ, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మౌళిక వసతుల కల్పనలో భాగంగా ట్రంక్ రోడ్డు, మినీ బైపాస్, పొదలకూరు రోడ్డులపై ఉన్న గుంతలు,ప్యాచ్ లను గుర్తించి రిపేరు పనులను పూర్తి చేయాలని సూచించారు. వాహన చోదకులకు అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా పనులను చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ శాఖ వారి విధుల్లో భాగంగా వృక్షాల కొమ్మలను తొలగించే సందర్భంలో ముందుగా నగర పాలక సంస్థకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, తరువాత కార్పొరేషన్ వాహనాల సహాయంతో కొమ్మల వ్యర్ధాలను తొలగించి, వాటిని డంపింగ్ యార్డుకు తరలించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూర్య గృహ యోజన పధకం అమలుకోసం నగర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కలిగి ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలను విద్యుత్ శాఖ వారు ఒక నివేదిక రూపంలో అందించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో ఆర్ & బి ఎస్.ఈ ఎమ్.గంగాధర, విద్యుత్ శాఖ ఎస్.ఈ. పి.విజయన్, ఇంజనీరింగ్ ఎస్.ఈ. టి.సంపత్ కుమార్, ఈ.ఈ లు మురళీ కృష్ణ, సోమశేఖర్, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. చైతన్య పాల్గొన్నారు.