లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న హస్పటల్ సీజ్
తిరుపతి: తిరుపతి త్యాగ రాజ్ నగర్ పాత మెటర్నిటి హాస్పిటల్ రోడ్ లోని శ్రీ సాయి సర్జికల్& మెటర్నిటి హాస్పిటల్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆధ్వరంలో తనిఖీలు చేశారు.. ఎంక్వయిరిలో కొంత మంది ప్రైవేటు ప్రాక్టీషనర్స్ ఈ హాస్పిటల్ కు చిత్తూరు,,తమిళ నాడు-ఇతర ప్రాంతాల నుంచి లింగ నిర్ధారణ పరిక్షలకు గర్భిణీ స్త్రీలను ఇక్కడి పంపిస్తున్నట్లు తెలిసింది. స్కాన్ సెంటర్ లో డాక్టర్,, హాస్పిటల్ MDలు,, జిల్లా అధికారులు తనిఖీలు చేసేందుకు తలుపు తెరవకుండా లోపల నుంచే పలుకుబడి ఉపయోగించి విషయాలను మాఫీ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది..అధికారులు ఎంక్వయిరిలో క్లారా అనే ఎటువంటి వైద్య విద్య ఆర్హత లేని వ్యక్తి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలింది.. హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు..అలాగే త్వరలోనే మిగిలిన ప్రైవేటు ప్రాక్టీషనర్ల పైన కూడా ఎంక్వయిరి మొదలవుతుందని జిల్లా అధికారి తెలియచేసారు..తనిఖీల్లో ఇంఛార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి,,డెమో సెక్షన్ నుంచి బాబునెహృరెడ్డి తదితరులు పాల్గొన్నారు.