రోడ్లు,కాలువల్లో నీటి ప్రవాహాంకు అటంక లేకుండా చూడండి-కమిషనర్ నందన్
నెల్లూరు: ముంథా తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు,,డ్రైన్లు, కాలువల్లో నీటి ప్రవాహాంకు అటంక లేకుండా చూడాలని కమిషనర్ నందన్ అదేశించారు. మంగళవారం నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్, ట్రంకు రోడ్డు తదితర ప్రాంతాలలో రైల్వే కాలువలను పరిశీలించి బ్లాక్ అయిన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించే పనులను పరివేక్షిస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా స్థానిక 24 / 3 ఇందిరమ్మ కాలనీ రెండవ వీధి ప్రాంతంలో భారీ వర్షాలకు కూలిపోయిన పెద్ద వృక్షాన్ని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శానిటేషన్ కార్యదర్శి నేతృత్వంలో సచివాలయ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తొలగించి వీధిలో క్లియరెన్స్ పనులను చేపట్టారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు, సచివాలయ కార్యదర్శులు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

