రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పెండింగ్ ఎలక్ట్రిక్ పవర్ లైన్ షిఫ్టింగ్ పనులు-కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు 7 ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ లను ఆగస్ట్15 లోపు పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడిసిఎల్ తదితర సంబంధిత అధికారులను ఆదేశించారు..శుక్రవారం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ల షిఫ్టింగ్ త్వరిత గతిన పూర్తి చేయాలి అని ఆదేశించగా సదరు అధికారులు 4 టవర్లను ఆగస్ట్ 8 నాటికి, మిగిలినవి ఆగస్ట్ 15 నాటికి షిఫ్టింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 నాటికి సదరు పెండింగ్ అంశాలు పూర్తి చేయాలనీ కలెక్టర్ సూచించారు. అలాగే మీడియన్ లైట్ల ఏర్పాటు త్వరిత గతిన ఏర్పాటు చేసి లైటింగ్ బ్లాక్ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రహదారులు భవనాల శాఖ వారు ఎయిర్ పోర్టు సమీప కూడలిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, ఏపీ ఎస్పీడిసిఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు, ఆర్ అండ్ బి ఎస్ఈ మధుసూధన్ రావు, ఏపీ ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.